పెండింగ్లో ఉన్న జీపీ సిబ్బందికి వేతనాలు చెల్లించాలి

Pending salaries of GP staff should be paid– ఎంపీడీఓ బాలరాజుకు వినతి 
నవతెలంగాణ – నెల్లికుదురు 
గ్రామ పంచాయతీ లో విధులు నిర్వహస్తున్న సిబ్బందికి తక్షణమే పెండింగ్లో ఉన్న వేతనాలను మొత్తం చెల్లించాలని ఎంపీడీవో బాలరాజుకు వినతిపత్రాన్ని అందించినట్లు గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్ యూనియన్ నాయకులు యాకయ్య వెంకన్న రాంబాబు చాంద్ పాషా తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని  ఎంపీడీవో బాలరాజుకు సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ సిబ్బందికి గత 12 నెలల నుండి కొంత మందికి వేతనం రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. ఆర్థిక ఇబ్బంది ఏర్పడి పూట గడవక ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. విద్యార్థులను చదివించుకోలేక కుటుంబాన్ని పోషించలేక అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారుల స్పందించి మాకు పెండింగ్లో ఉన్న బకాయిలను ఇప్పటివరకు చెల్లించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.