పెండింగ్‌లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలి

పెండింగ్‌లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలి– సీఐటీయూ మండల కన్వీనర్‌ పోచమోనీ కృష్ణ
– మధ్యాహ్న భోజన కార్మికుల
– రిలే నిరాహారదీక్షలు ప్రారంభం
నవతెలంగాణ-మంచాల
మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్‌లో ఉన్న జీతాలు వెంటనే చె ల్లించాలనీ సీఐటీయూ మండల కన్వీనర్‌ పోచమోనీ కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం మండల కేంద్రంలో మధ్యాహ్నం భోజన కా ర్మికులు రిలే నిరాహారదీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గ డుస్తున్నా మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు, మెస్‌ఛార్జీలు ఇవ్వక పో వడం విచారకరమని అన్నారు. ముఖ్యంగా 9 నెలల నుండి కోడిగుడ్డు బి ల్లులు రావల్సి ఉందని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు రేవంత్‌ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రూ. 10 వేల వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో మధ్యాహ్నం భోజన కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రతి మండల కేం ద్రంలో రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారని అన్నారు. కాబట్టి ప్రభుత్వం వెం టనే స్పందించి న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలని డిమాం డ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కోశాధికారి సరిత, మండల నా యకులు అలివేలు, జంగమ్మ, యాదయ్య, తదితరులు ఉన్నారు.