నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్:చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని కందాల రంగారెడ్డి భవన్లో ఎస్ఎఫ్ఐ మండల ముఖ్య కార్యకర్తల సోమవారం సమావేశం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్,ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల గాక విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు సకాలంలో ప్రభుత్వం స్కాలర్షిప్లు విడుదల చేయక నిర్లక్ష్యం చేస్తూ విద్యార్థి జీవితాలతో ఆటలు ఆడిందని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తిగా విద్యారంగాన్ని విస్మరించిందని, విద్యారంగానీ నిర్లక్ష్యం చేస్తూ పాలన కొనసాగించిందని వారన్నారు.పేద విద్యార్థులు చదువుకోవడానికి ఒక వరంగా ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ పథకం ఉన్నదని అన్నారు. కానీ స్కాలర్షిప్ విడుదల కాక పేద విద్యార్థుల చదువు ముందుకు పోకుండా మధ్యలోనే ఆపివేసి చదువుకు దూరం అవుతున్నారని అన్నారు.