పెండింగ్ స్కాలర్ షిప్ లను విడుదల చేయాలి ..

Pending scholarships should be released..నవతెలంగాణ – కంఠేశ్వర్ 

పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జనవరి 8న ఇంద్ర పార్క్ వద్ద నిర్వహించే బిసి విద్యార్థుల సమర శంఖారావం కరపత్రాలు బిసి సంక్షేమ సంఘo నిజామాబాదు జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ కేర్ డిగ్రీ కాలేజ్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరాల సుధాకర్ మాట్లాడుతూ.. తక్షణమే గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సుమారుగా 4.500 కోట్ల ఫీజు రియాబర్స్మెంట్ స్కాలర్ షిప్ లను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులకు ఏ విధంగా అయితే స్కాలర్ షిప్ వస్తుందో అదేవిధంగా బీసీ విద్యార్థిలకు కూడా ర్యాంకుతో సంబంధం లేకుండా పూర్తి ఫీజులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు, బీసీ గురుకులాలకు, సంక్షేమ వసతి గృహాలలో సొంత భవనాలు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు బీసీలకు ప్రవేట్ యూనివర్సిటీలలో రిజర్వేషన్ అమలు చేయాలని అన్నారు పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ మంజూరు సంఖ్యను పెంచాలన్నారు హైదరాబాదులో 10 ఎకరాలలో పూలే నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి బీసీ విద్యార్థి నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి బీసీ విద్యార్థుల సమర శంకరాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు సంతోష్, ప్రధాన కార్యదర్శి శేఖర్, బుస్స ఆంజనేయులు, ఆకుల ప్రసాద్, ధర్శనం దేవేందర్, శ్రీలత, శంకర్ తదితరులు పాల్గొన్నారు.