పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి

నవతెలంగాణ – మీర్ పేట్
పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్యాంప్ కార్యాలయ ముట్టడిని మీర్ పేట్ పోలీసులు భగ్నం చేశారు. ముట్టడికి వచ్చిన ఏబీవీపీ నాయకులు కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు శ్రీకాంత్, మహేష్ మాట్లాడుతూ దాదాపు రూ 3500 కోట్లు స్కాలర్షిప్ పెండింగ్ ఉన్నయని ఇప్పటి వరకు మంత్రి స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, కనీస సౌకర్యాలు కల్పించి, టీచింగ్, నాన్ టీచింగ్, వివిధ శాఖల్లో పెండింగ్ లో ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయాలని, గ్రూప్-1 రిజల్ట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.