పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలి

నవతెలంగాణ- తిరుమలగిరి
పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని సూర్యాపేట జిల్లా లెక్చరర్స్ అసోసియేషన్ ప్రధాన  కార్యదర్శి గాదరబోయిన లింగయ్య మరియు తిరుమలగిరి మండల అధ్యక్షుడు సంగెపాక  ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ప్రభాకర్ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీలు గ్రామీణ  ప్రాంతాల్లోనూ, మండల ప్రాంతాల్లోనూ,మినీ  అర్బన్ ప్రాంతాలోనూ పూర్తిగా రియంబర్స్మెంట్ పై ఆధారపడి నడుస్తున్నాయాన్నాని, సకాలంలో స్కాలర్షిప్లు రాక ప్రైవేట్ యాజబద్యాలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తెలగర ఉద్యమంలో ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు వారి విద్యార్థులను వందలాది మంది ని  రోడ్డు మీదికి తీసుకొచ్చి ఉద్యమంలో కీలకపాత్ర పోషించారన్నారు. పది సంవత్సరాలుగా  పరిపాలన సాగించిన గత కెసిఆర్ ప్రభుత్వం మాకు రావలసిన నాలుగు సంవత్సరాల స్కాలర్షిప్ లను విడుదల చేయలేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులందరికీ పూర్తిగా స్కాలర్షిప్ ల పైనే  విద్యను అందిస్తున్నామని  పేర్కొన్నారు. సరైన సమయంలో స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడం వల్ల లెక్చరర్స్ కు జీతాలు ఇవ్వలేక అప్పులు చేసి ఇచ్చే పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు, ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ లు మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి అహర్నిశలు కృషి చేయడం జరిగిందన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని నూతన ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేసి ప్రైవేట్ యాజమాన్యాలను ఆదుకోవాలని  ప్రభుత్వాన్ని కోరారు.