పెండింగ్ స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలి..

Pending scholarships should be released immediately..– విద్యాశాఖ మంత్రిని కేటాయించాలి
– బివిఎం తెలంగాణ యూనివర్సిటీ ఇంచార్జ్ ఆర్బస్ ఖాన్..
నవతెలంగాణ – డిచ్ పల్లి
నూతనంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పది నెలలు గడుస్తున్న ఇప్పటివరకు విద్యా వ్యవస్థ పై దృష్టి పెట్టకపోవడం చాలా బాధాకరమని, ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని కేటాయించక పోవడం వలన విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ నాశనం చేయడమే, గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే విద్యా వ్యవస్థను నాశనం చేసిందో అదే దిశలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అడుగులు వేయడం సరికాదని బివిఎం తెలంగాణ యూనివర్సిటీ ఇంచార్జ్ ఆర్బస్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం తెలంగాణ యూనివర్సిటీ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బస్ ఖాన్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా నిద్రలేవాలి , తక్షణమే  పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విద్యార్థులకు న్యాయం చేసి విద్యా వ్యవస్థను పటిష్ఠం చెయ్యాలని  డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పుతారని, భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని  హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో బివిఎం నాయకులు పాల్గొన్నారు.