పెండింగ్, సమ్మె కాలంనాటి వేతనాలు ఇప్పించాలి

– డీపీఓ కు వినతిపత్రం అందజేసిన జీపీ సిబ్బంది
నవతెలంగాణ – మల్హర్ రావు
4నుంచి 8 నెలలుగా పెండింగ్ లో ఉన్న, సమ్మె కాలంలో నిలిసిన కారొబార్ల, పంచాయతీ సిబ్బంది వేతనాలు ఇప్పించాలని భూపాలపల్లి జిల్లా పంచాయతీ అధికారి నారాయణ రావుకు గ్రామపంచాయితీ,కారొబార్, బిల్ కలెక్టర్స్ ఉద్యోగుల సంఘము రాష్ట్ర కార్యదర్శి సాదుల శ్రీకాంత్,జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీధర్,రాష్ట్ర కమిటీ సభ్యుడు తొలకనూరి అశోక్  ఆధ్వర్యంలో మంగళవారం వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడారు 8 నెలలుగా జిపి సిబ్బందికి వేతనాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.వేతనాలు సకాలంలో  రాకపోవడంతో కార్మికుల జీవితాలు చీకటి మయంగా మారాయన్నారు.అందిఅందని వేతనాలతో రోజు పూట గడవడం కష్టంగా మారిందన్నారు.అదే విధంగా 33 రోజులు సమ్మె చేసిన వేతనాలు సైతం రాలేదన్నారు. మోరంచపల్లి గ్రామం వరద ముంపునకు గురి కావడం వలన మానవదృక్పదంతో కారొబార్లు, పారిశుద్ధ్య సిబ్బంది అక్కడ విస్తృతంగా పారిశుద్ధ్య పనులు చేయడం జరిగిందని తెలిపారు.పంచాయతీ కార్యాలయాల్లో పనిచేసే కార్మిక సిబ్బందికి రూ.5 లక్షల ప్రమాద బిమాను అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మెదరి రాజేందర్, పూర్ణ,జిల్లెల కుమార్, సదాశివ రెడ్డి,యుగేoదర్, నరేశ్ పాల్గొన్నారు.