
గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని గురువారం చౌటుప్పల్ మండల ఎంపీవో కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు, ఆదిమూలం నందీశ్వర్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మిక వేతనాలు సమయానికి ఇవ్వకపోవడం వలన,ఆర్థిక ఇబ్బందులు పడుతూ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది కావున అతి తొందరగా పెండింగ్ వేతనాలు ఇవ్వాలని ఆదిమూలం నందీశ్వర్ అన్నారు.ప్రతి నెల పారిశుద్ధ మెటీరియల్ ఇవ్వాలని,కొన్ని గ్రామపంచాయతీలో ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. కావున ఆ మెటీరియల్ కూడా ప్రతి నెల ఇవ్వాల్సిందిగా కోరడమైనది మరియు గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని జీవో నెంబర్ 51 సవరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని వివిధ డిమాండ్స్ తోనివినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామపంచాయతీ యూనియన్ నాయకులు మాండ్ర శీను, ఎలివేటి నరసింహ,రామచంద్రం,ఉట్కూరి రమేష్,భాగ్యమ్మ,పప్పు లింగస్వామి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.