
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘo ఉపాధి కూలీలకు పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కత్తుల లింగస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం చండూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో చండూర్ ఎండిఓ ఆఫీస్ సూపర్డెంట్ మురళి మనోహర్ కివినతి పత్రం ఇవ్వడం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఉపాధి హామీ చట్టాన్ని రక్షించాలని, ఉపాధి సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలనిఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ఉపాధి హామీ లో పనిచేస్తున్న కూలీలకు గతంలో వారం వారం డబ్బులు వచ్చేవని ఇప్పుడు నెలల తరబడి రాకపోవడం మూలంగా కూలీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో క్రమేపి నిధులు తగ్గించడం మూలంగా పెద్ద ఎత్తున పెండింగ్ వేతనాలు పేరుకపోయాయని వెంటనే డబ్బులు విడుదల చేసి కూలీలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉపాధి సిబ్బందిని పర్మనెంట్ చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారని అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడుస్తున్న పట్టించుకోకపోవడం దారుణమని వెంటనే ఉపాధి సిబ్బందిని పర్మిట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఉపాధి హామీకి నిధులు కేటాయించి కూలీలను ఆర్థిక ఇబ్బందుల నుండి ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని తెలిపారు పెరుగుతున్న దరల కనుగుణంగా దినసరి కూలి 600 రూపాయలు ఇచ్చి, ప్రతి కుటుంబానికి 200 రోజులు పనులు కల్పించాలని, ఉపాధి హామీ ఫీల్ అసిస్టెంట్లను పర్మినెంట్ చేసి వారి వేతనాలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు జోగు లక్ష్మయ్య, మండల నాయకులు మొగుదాల వెంకటేశం, చిట్టిమల్లలింగయ్య ఏపీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.