పెండింగ్ వేతనాలు అందించాలి..

Pending wages should be provided..– ఎంపిడిఓకు వినతిపత్రాన్ని అందజేసిన ఈజిఎస్ సిబ్బంది

నవతెలంగాణ – మల్హర్ రావు
పెండింగ్ వేతనాలు ఇప్పించాలని బుధవారం మండల ఎంపిడిఓ శ్యాంసుందర్ కు మహత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ సిబ్బంది వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు ప్రభుత్వం మూడు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం ఉపాధిహామీ ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధిహామీ ఎపిఓ గిరి హరీష్,టెక్నీకల్ అసిస్టెంట్లు,పిల్డ్ అసిస్టెంట్లు,సిబ్బంది పాల్గొన్నారు.