– మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచులు, ఎంపీటీసీ విజ్ఞప్తి
– సాదాసీదాగా సాగిన సర్వసభ్య సమావేశం
నవతెలంగాణ-శంషాబాద్
గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో చేపట్టాల్సిన పనులు అసంపూర్తి పను లను వెంటనే పూర్తి చేయాలని మండల పరిధిలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు అన్నారు. మంగళవారం శం షాబాద్ మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్ అధ్యక్షతన మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగింది. సమావేశంలో పాల్గొన్న సర్పంచులు గ్రామాల్లో అసంపూర్తిపరుల ను వెంటనే పూర్తి చేయాలని కోరారు. సర్పంచ్‌ల పదవీ కాలం ఫిబ్రవరి 2 తేదీన ముగుస్తున్నందున అంతలోపు మంజూరైన నిధు లతో పనులు పూర్తి చేయాలని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. సర్పంచులుగా గ్రామాల్లో చేపట్టిన పనులను పూర్తి చేశామన్న విషయాన్ని ప్రజల్లో చెప్పుకోవడానికి వీలుంటుందన్నారు. సర్వసభ్య సమావేశంలో సాధారణ సమస్యలు మాత్రమే చర్చకు వచ్చాయి. ఎండాకాలం సమీపిస్తున్న కారణంగా తాగునీటి సమస్య, విద్యుత్ సమస్య లేకుండా చూడాలని కోరారు. జడ్పీటీసీ నీరటి తన్వి రాజు ముదిరాజ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ సహకారంతో మండలంలో వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ప్రభు త్వం పల్లె ప్రకృతి వనాలు, పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలతో పాటు అనేక అభివృద్ధి పనులు చేపట్టిందని గుర్తు చేశారు. ఎంపీపీ జయమ్మ మాట్లాడుతూ ఈ ఐదేండ్లలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని ప్రభుత్వ పథకాలను విజయవంతం చేయ డంలో సర్పంచులు కీలకపాత్ర పోషించారని అన్నారు. గత ప్రభుత్వం హయంలో జరగనన్ని అభి వృద్ధి పనులు ఈ సర్పంచ్ల కాలంలో జరిగాయన్నారు. ప్రజా ప్రతిని ధులు లేవనెత్తిన అంశాన్ని వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వసంత లక్ష్మి, వైస్ ఎంపీపీ నీలం మోహన్, డీఈఈ సంజీవరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ బుర్కుంట సతీష్, సర్పంచులు వట్టెల సతీష్‌యా దవ్, హస్లీ రాములు, కల్పనా సింహారెడ్డి, సునిగంటి సిద్దులు, కటికల రాజ్ కుమార్, చిటికెల వెంకటయ్య, వి.రవీందర్‌నాయక్, దేవానాయక్, మహేందర్‌రెడ్డి, పి.రామ్ గోపాల్, కర్రె బుచ్చమ్మ, చిన్న గోల్కొండ పీఏసీఎస్ చైర్మన్ బొమ్మ దవణాకర్‌గౌడ్, ఎంపీటీసీ గడ్డమీద యాదగిరి, కో-ఆప్షన్ సభ్యులు గౌస్, అధికా రులు రాంరెడ్డి, యాదగిరిరెడ్డి, సూర్యనారాయణ, సంధ్య, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.