మంథని ఛైర్ పర్సన్ గా పెండ్రు రమ సురేష్ రెడ్డి

– వైస్ ఛైర్మన్ గా శ్రీపతి బానయ్య
నవతెలంగాణ – మంథని
పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ చైర్ పర్సన్ గా పెండ్రు రమ సురేష్ రెడ్డి ఎన్నిక కాగా వైస్ చైర్మన్ గా శీపతి బానయ్య నియామకమైనారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ ఎన్నిక సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల అధికారి ఆర్డిఓ హనుమ నాయక్,మున్సిపల్ కమిషనర్ సమక్షంలో మునిసిపల్ కౌన్సిలర్ సభ్యులు చేతులెత్తాగా ఎన్నిక లాంచనా ప్రయాoగా జరిగింది.గత నెల 16న జరిగిన మంథని మునిసిపల్ అవిశ్వాస బలపరీక్షలో బిఆర్ఎస్ కు చెందిన ఏడుగురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు మంథని చైర్మన్ పుట్ట శైలజ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటేసి చైర్మన్ వైస్ చైర్మన్ లను సీట్ నుండి దింపివేసిన నేపథ్యంలో ఖాళీ అయిన సీట్ల భర్తీ కోసం సోమవారం ఎన్నిక జరిగింది.పూర్తిస్థాయి మెజార్టీ ఓట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ చైర్మన్,వైస్ చైర్మన్ పదవులను కైవసం చేసుకుంది.కాంగ్రెస్ పార్టీలో చురుకుగా కొనసాగుతూ మంథని పట్టణ ప్రజలకు సుపరిచితులుగా ఉన్న రమ-సురేష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన వెంటనే చైర్మన్ గా పెండ్రు రమ సురేష్ రెడ్డి,వైస్ చైర్మన్ గా శ్రీపతి బానయ్యలు ప్రమాణస్వీకారం చేశారు. ఈ ఎన్నిక నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు గట్టి బందో బస్తు ఏర్పాటు చేశారు.మంథని మునిసిపల్ రెండవ చైర్మన్ గా13వ వార్డు పేండ్రు.రమ,వైస్ చైర్మన్ గా బానయ్యలు లాంచనప్రాయంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు.
మున్సిపల్  చైర్మన్,వైస్ చైర్మన్ల ను సన్మానించిన మంథని ఎంపీపీ: మంథని మున్సిపల్ చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన పెండ్రు రమా సురేష్ రెడ్డిని,వైస్ చైర్మన్ శ్రీపతి బాణయ్యలను మంథని ఎంపీపీ కొండ శంకర్ సోమవారం  శాలువాతో ఘనంగా సత్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్డి వర్గానికి,బీసీ వర్గానికి తగిన న్యాయం జరిగిందని,ధర్మం నెగ్గిందనడానికి ఇదే నిదర్శనం అన్నారు. చైర్మన్ వైస్ చైర్మన్ ల ఎన్నికకు సహకరించిన రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుకు కౌన్సిలర్లకు స్థానిక నాయకులకు y ఆయన కృతజ్ఞతలు తెలిపారు.