పెంకుటిల్లు : తాత్పర్యానికి పరిమితం కాని కవిత్వం

Penkutillu: Poetry that is not limited to meaningచేదబావి, కల ఇంకా మిగిలే ఉంది, పెంకుటిల్లు కాంచనపల్లి వచన కవితా సంపుటాలు. విద్యార్థి దశలో ప్రచురించిన భావమంజరి అటు కొన్ని పద్యాలు, ఇటు కొన్ని గేయాలుగా రాసుకున్న గ్రంథం. ఇక తండ్లాట గేయం వచనం కలిసినట్లున్న దీర్ఘకవిత. ఇది తెలంగాణ ఉద్యమ అవసరంగా వచ్చింది. చేదబావి, కల ఇంకా మిగిలే ఉంది ద్వారా వచనకవిగా కాంచనపల్లి పాఠకులకు చాలా చేరువయ్యాడు. 2024లో వచ్చిన పెంకుటిల్లు సంపుటి ఆయన అభివ్యక్తికి అద్దం పడుతుంది.
ఖచ్చితంగా పట్టుబట్టి కూర్చుంటే ఏ ప్రక్రియలోనైనా సజన చేయవచ్చునేమో కానీ కవిత్వంలో కష్టం. వచన కవిత్వంలో మరీనూ. వచన కవిత్వం వస్తే రాసేదే కానీ, రాస్తే వచ్చేది కాదు. ఫీల్‌ లేకుండా రాస్తే వచన కవిత్వం తేలిపోతుంది. ఆ ఫీల్‌ వచన కవిత్వానికి ఒక ఆటోమేటిక్‌ ణఱష్‌ఱశీఅ ను సంతరిస్తుంది. ఆ ణఱష్‌ఱశీఅ వల్ల ఒక వస్తువును ఏ రూపంలోకి తేవాలో ఆ రూపంలో తెస్తుంది. అప్పుడే అది మంచి కవిత అవుతుంది. అందుకే ‘ఆ విధంగా తప్ప ఇంకే విధంగానూ రాయలేనిది ఉత్తమ కవిత’ అన్నాడు ఎమర్సన్‌. పెంకుటిల్లులో అలాంటి ఒక కవితను చూద్దాం.
సాయంత్రం పార్కులు అనే కవితను కవి తొమ్మిది భాగాలుగా విభజించాడు. మొదటి భాగంలో విశ్రాంత జీవుల గమనాన్ని, రెండవ భాగంలో శునకాన్ని ఆడించే బలహీనమైన వ్యక్తి, మూడవ భాగంలో బైకుపై వచ్చే ప్రియుడి కోసం వేచి చూస్తున్న ప్రియురాలు, మరో భాగంలో సమయం అయిపోయినందుకు బయటికి వెళ్ళమని సూచనలు ఇస్తున్న పార్క్‌ కీపర్‌, ఇంకొక విభాగంలో పిల్లలు హౌంవర్క్‌ భయంతో ఇంటి దారి పట్టడం, మరొక విభాగంలో ఉద్యోగులు స్వేచ్ఛగా రాజకీయాలను విమర్శించడం, ఇంకొక విభాగంలో ఉద్యోగినులు తమవైన ప్రత్యేక బాధలను ఏకరు పెట్టుకోవడం, మరొక విభాగంలో గహిణులు తమ బాధలు తమలో తాము చెప్పుకుంటూ నిష్క్రమించడం ఉంటుంది. చివరి విభాగంగా
‘పార్క్‌ అంటే భిన్న జనాల ఆకుపచ్చని ఒడి కదా
బతుకు ప్రయాణంలోని
గాయాల రాళ్ళకు లేపనం
పూసుకునే విశ్రాంతి తీరం కదా’
అని పార్క్‌కి తనదైన నిర్వచనం ఇచ్చి కవితను ముగించడం ఈ కవి ప్లాన్‌. ఈ ప్రణాళిక కవి కాన్షియస్‌గా వేసుకుని ఉండవచ్చు లేదా అన్కాన్షియస్‌గా ఈ శైలి కవికి అలవడి ఉండవచ్చు. వర్తమానపు వచన కవిత్వానికి కవి తనకు తాను నిర్మించుకున్న బయటికి కనిపించని సొంత ఛంబస్సు ఒకటి ఉంటుందని చెప్పవచ్చు. ఆ ఛంబస్సులో ఒక శక్తివంతమైన కవిత ఇలా బయటికి వస్తుంది. ఈ కవితలో ‘చైతన్య ముఖ నీరసుడు’ అంటూ ఒక వింత బహువ్రీహీని ఉపయోగిస్తాడు కవి. అలాగే ప్రియుడి రాక కోసం ఎదురుచూస్తున్న ఒక ప్రేయసి గురించి చెబుతూ ఒక మనోహరమైన భావ చిత్రాన్ని సష్టిస్తాడు.
‘ముఖానికి నల్లని మబ్బులని
కప్పుకున్న ఓ చంద్రబింబం
ఓ మూల మునివేళ్ళను
ఆలోచనలను చేసి
కొరుకుతున్న పెదాలతో
రెండు కాళ్ల పెట్రోలు గుర్రం మూసుకొచ్చే
కలల రాకుమారునికై ఎదురు చూస్తుంటుంది’
అంటాడు. నిర్మాణ బిగి రీత్యా ఈ కవితను ఒక ఉదాహరణగా మనం ఈ సంపుటిలో నుంచి తీసుకోవచ్చు. పెంకుటిల్లులోని చాలా కవితలు దేనికదే తమదైన స్వంత శైలిని వస్తువును బట్టి ఏర్పరచుకోవడం కూడా గమనించవచ్చు. ఈ కవితలన్నింటిలో కూడా ఒక మనిషి మరొక మనిషితో చేసే ఆత్మీయమైన సంభాషణ లాంటి వాక్యాలు ఉండడం వచన కవిత్వ లక్షణం అని మనం భావిస్తూ ఉంటాం. కానీ కాంచనపల్లి ప్రాచీన కవిత్వ అధ్యయన ముద్ర అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల సమాసాలు చాలా సంస్కతమయంగా అలవోకగా పడిపోతూ ఉండడం కూడా గమనించవచ్చు. ‘చిరిగిపోతున్న కాగితం’ అనే కవితలో ‘అదశ్య రక్తరేఖలు ద్రవీకరించిన అంతర్జాల విన్యాసాలలో” అంటాడు. ‘వెలుగు మొక్క విరుస్తుంటే’ అనే కవితలో ‘మెదడుకు కమ్మిన నీలిమబ్బు వర్షాలు సముద్రిస్తుంది’ అంటాడు. ఇక్కడ కమ్మడంను ఎక్కువ మంది వచన కవులు కమ్మడంగా రాస్తారు. అలాగే సముద్రించడం అనే క్రియ కూడా భిన్నమైన ప్రయోగమే. ఇలాంటివి కాంచనపల్లి కవిత్వంలో చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి.
ఈ కవితలన్నీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాయబడ్డవే. అయినా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాసిన ఒకటి రెండు కవితలలో తెలంగాణ ఆవశ్యకత నొక్కి చెప్పబడ్డది. 2020 నుంచి విజభించిన కరోనా మీద సహజంగానే పెద్ద సంఖ్యలో కవితలు ఉన్నాయి. నాన్నపై రాసినది, వట్టికోటపై, సినారెపై, సైనికుడిపై, సెవెన్‌ సీటర్‌ ఆటో డ్రైవర్‌ పై, కలర్‌ టీవీ మీద, కుందెన మీద, ప్రయివేటైజేషన్‌ కాలంలో వెలవెలబోతున్న పెద్దబడి మీద, వాలు కుర్చీ మీద రాసినవి వేటికవే చర్చించదగ్గంత మంచి అభివ్యక్తులున్న కవితలు. కొన్నింటిలో అంతర్గత సంఘర్షణ ఏదో బలంగా ఉండి కొందరు వ్యక్తులని లక్ష్యంగా పెట్టుకొని రాసినట్టుగా కూడా కనిపిస్తాయి.
మొదలే చెప్పుకున్నట్టు కాంచనపల్లి ఇష్టపడి వచనం రాస్తున్న వ్యక్తి. వచనం మాత్రమే రాయగలిగిన కవి కాదు. అందువల్ల ఆయన అభివ్యక్తిలో చర్చించదగ్గ సొబగులు చాలా ఉన్నాయి. కవి చనిపోయాక బతుకుతాడు అనే అర్థంతో రాసిన కవితలో
‘భూమితో రమించి మబ్బులు
ఆకుపచ్చగా మొలకెత్తడం లేదు’
అనడం కొత్త ఊహ. అలాగే కవితను ముగిస్తూ ‘బతుకుతూ చనిపోయేవాడు చనిపోయిన బతుకుతాడు’ అనడం సమాజం కోసం వేదనామయ జీవితాన్ని అనుభవిస్తున్న కవి జీవిత కాలంలో రబజూతీవరర చేయబడ్డా, తర్వాతనైనా అతని చరిత్ర నిలబడే ఉంటుంది అనే అర్థంలో పాఠకుడు చాలా సులభంగా స్వీకరించగలిగేటట్టు చెప్పాడు కవి.

‘దూడలను ఇంగ్లీషు
మీడియం ప్రయివేట్‌ కబేలాలకు
బలవంతంగా తరలిస్తున్నప్పుడు
ఆవు తల్లి లాంటి
ఆ పెద్ద బడి
ఎంత దుఃఖాగ్ని ప్రవేశం చేస్తుందో’

అన్నప్పుడు

‘దేశం తెల్లకాగితమై
డోర్‌ ముందు వాలుతుంది’
అని దినపత్రికకు ప్రతీకలను వాడినప్పుడు, నగరంలోని ఇరుకు గదిలో జీవితం గురించి చెబుతూ

‘జీవితం నది
ఆ నాలుగు గోడల మధ్య
చిత్రంగా ప్రవహించేది’

ఊహాశక్తి ప్రకటనయే కవిత్వం అంటాడు హాజ్‌ లిట్‌. కాంచనపల్లి కవిత్వంలో చాలా కొత్త ఊహలు ఉంటాయి. సెవెన్‌ సీటర్‌ ఆటోను రూపాంతరం చెందిన ఎడ్లబండి అంటాడు. తన ఇద్దరు కూతుర్లు పెద్దవాళ్ళై విదేశాలకు వెళ్ళిపోయినప్పుడు వాళ్లను ‘రెక్కలు మొలిచిన రెండు పావురాలు’అని సంకేతిస్తాడు. చిన్న కూతురు వేకువకు కూతురు పుట్టినప్పుడు ‘వేకువ…మరో వేకువ’ అనడంలో మంచి ధ్వని కూడా ఉంది.
‘నేనెందుకు కవిత్వం రాస్తున్నాను?’ అనే ప్రశ్న వేసుకుని ‘సామాజికతే లక్ష్యం. ప్రజలే ఇస్తటిక్స్‌. బాధలో నన్ను, నాలో బాధను అక్షరించడమే మార్గం’ అని కాంచనపల్లి చెప్పుకున్న జవాబు సగటు కవులకు వర్తించి తీరేది కూడా.
ఏనుగు నరసింహారెడ్డి 8978869183