– సెప్టెంబర్1న నిరసనలకు టీఈజీజేఏసీ
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పెన్షనర్స్ భవనంలో టీఈజీ జేఏసీ భాగస్వామ్య సంఘాల సమావేశము నిర్వహించారు. ఈ సమావేశంలో ఉద్యోగుల పాలిట శాపంగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానానికి నిరసనగా సెప్టెంబర్ 1 ఆదివారం నాడు స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించాలని స్టీరింగ్ కమిటీ నిర్ణయించడం జరిగిందనీ టీఈజీ జేఏసీ నాయకుల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీఈజీ జేఏసీ భాగస్వామ్య సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.టి పి టి ఎఫ్ జిల్లా కార్యదర్శి సిహెచ్ అనిల్ కుమార్, టీఎన్జీవోస్ అధ్యక్షుడు వెంకటరెడ్డి, టీజీవో ప్రధాన కార్యదర్శి సాయి రెడ్డి, పి ఆర్ టి యు దామోదర్ రెడ్డి, కుషాల్, పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విఠల్రావు, సిపిఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు కుంట ఎల్లారెడ్డి, యుటిఎఫ్ సాయిలు, ఎస్ టి యు హనుమంత్ రెడ్డి, టి ఆర్ టి ఎఫ్ బషీర్ టి టి యు ముజీబుద్దిన్, రెవెన్యూ అసోసియేషన్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.