పెన్షన్ సవరణ చేయాలని నిజామాబాద్ అదిలాబాద్ జిల్లా కార్యదర్శులు ఈవిల్ నారాయణ కుమార్ బాబు అన్నారు. ఈ మేరకు మంగళవారం పెన్షన్ సవరణ చేయాలని నిజాంబాద్ అదిలాబాద్ ఆలిండియా బిఎస్ఎన్ఎల్ , ఎంటిఎన్ యల్ అసోసియేషన్స ఇచ్చిన పిలుపు మేరకు గాంధీ చౌక్ లోని సంచార్ భవన్ వద్ద ఆల్ ఇండియా బిఎస్ఎన్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్, ఆదిలాబాద్ పెన్షనర్స్ డిమాండ్స్ డే ను నిర్వహించారు. ఈ డిమాండ్స్ డే ప్రధాన ఉద్దేశం దాదాపు గత ఏడు సంవత్సరాలగా పేన్షన్ సవరణ జరగనందున వెంటనే పేన్షన్ సవరణ చేయాలని అలాగే బిఎస్ఎన్ఎల్ కు 4జీ /5జీ సర్వీస్ లు అందించాలనే రెండు ప్రధాన డిమాండ్లతో ఈ డిమాండ్స్ డే ని నిర్వహించారు. అనంతరం ఉమ్మడి జిల్లా ల జనరల్ మేనేజర్ కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శులు ఈ వి ఎల్ నారాయణ, కుమార్ బాబు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఆల్ పేన్షనర్స్ & రిటైర్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట నాయకులు కే. రామ్మోహన్ వచ్చి తమ మద్దతును తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్ బాల దుర్గయ్య గంగారం, ముత్తన్న, గణేష్, బాలస్వామి, నరేందర్ గౌడ్, విక్టరీయ, ఎం ఎన్ వి అనురాధ, సాయన్న తో పాటు దాదాపు 60 మంది పాల్గొన్నారు.