నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రజలు పదేండ్లుగా ఉక్కిరి బిక్కిరయ్యారనీ, ఈ రోజు స్వేచ్ఛా వాయు వులు పీల్చుకుంటున్నారని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆయన సీపీఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డితో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించారన్నారు. ఒక్కరైనా కమ్యూనిస్టు నేత అసెంబ్లీలో ఉండాలనీ, ఉంటే పేద వర్గాలకు కొండంత అండ ఉంటుందని తనకు అవకాశమిచ్చా రన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడు తానని తెలిపారు. పేద వర్గాల సమస్యలు ప్రభుత్వం ముందుంచే బాధ్యత తనపై ఉందని చెప్పారు. జర్నలిస్టుల సమస్యలు పరి ష్కారం కావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ సహ కారంతో గెలిచినప్ప టికీ ప్రజా సమ స్యలను ప్రభుత్వం దృష్టికి తీసు కెళ్లడం తన బాధ్యతని చెప్పారు. ఉపా లాంటి చట్టాలు పోవాలని ఆకాంక్షిం చారు. ధరణి అనేక సమస్యలున్నాయనీ, వాటి పరి ష్కారం కోసం కృషి జరగాలని అన్నారు.