
– బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పగిళ్ల సతీష్..
నవతెలంగాణ – మునుగోడు
కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బిఆర్ఎస్ మండల మండల ప్రధాన కార్యదర్శి పగిళ్ల సతీష్ అన్నారు . సోమవారం మండలంలోని గూడపూర్ గ్రామంలో బిఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేష్ కు ఓటు వేయాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు వల్లకాని అమ్మిలుచ్చి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిందని అన్నారు. 6 గ్యారంటీలు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చే తర్వాత అహంకారపూరితంగా ప్రసంగించడం దారుణమని మండిపడ్డారు. కెసిఆర్ ప్రభుత్వాలయంలో రైతుల కోసం పేద ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకంలను కొనసాగించకుండా అనేక కోరీలు పెడుతూ లబ్ధిదారులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నదని మండిపడ్డారు. రైతుల పక్షాన పేద ప్రజల పక్షాన ప్రశ్నించేందుకు కారు గుర్తుపై ఓటు వేసి క్యామ మల్లేష్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు లాల్ బహుదూర్ గౌడ్ , పోలగోని సైదులు గౌడ్ , దోటి కరుణాకర్ నన్నూరు భూపతిరెడ్డి , మేకల శ్రీనివాస్ రెడ్డి , వనం లింగయ్య , అయితగోని విజయ్ గౌడ్ , గ్రామ శాఖ అధ్యక్షులు మల్లేష్ తదితరులు ఉన్నారు.