ఘనంగా హోలీ సంబరాలు.. రంగుల్లో మునిగితేలిన జనం

నవతెలంగాణ -తాడ్వాయి
మండల వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరానంతయి. రంగుల పండుగ కేరింతరు ఆనంద ఉత్సవాల మధ్య సోమవారం ప్రజలు హోలీ పండుగను జరుపుకున్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో ఈ వీధిలో చూసిన హోలీ వేడుకలు కనువిందు చేశాయి. చిన్నారులు యువతీ యువకులు పెద్దలు రంగుల్లో మునిగి తేలారు. పలుచోట్ల హోలీ సందర్భంగా కామ దహనం నిర్వహించారు. చిన్న పెద్ద కలిసి ఆడిపాడుతూ రంగులు పూసుకుంటూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీల అధ్యక్షులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.