బీఆర్ఎన్ పాలనలో ప్రజలు దుర్భర స్థితి..

– భ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దామోదర్ ఆరోపణ 
– పలువురు బేగంపేట గ్రామస్తులు కాంగ్రెస్ లో చేరిక
నవతెలంగాణ-బెజ్జంకి:
బీఆర్ఎస్ పాలనలో నాయకులు వ్యవహరించిన తీరువల్ల ప్రజలు దుర్భర దుస్థితికి చేరుకున్నారని భ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దామోదర్ ఆరోపించారు. సోమవారం మండల పరిధిలోని బేగంపేట గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీలో చేరగా భ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దామోదర్ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయ వద్ద పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సంధర్భంగా దామోదర్ మాట్లాడారు. అభివృద్ధి పేరునా ఆర్థికంగా లబ్ధి చేకూర్చే పనులు చేపట్టి.. లబ్ధి చేకూరని పనులను ఆర్థాంతరంగా నిలిపి వేసిన ఘనత ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దని ఎద్దేవా చేశారు. మళ్లీ తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ నాయకులు సంక్షేమ పథకాలను వర్తింప చేస్తామని మోసపూరితమైన మాటలతో ప్రజలను మభ్యపెట్టే యత్నాలు చేస్తున్నారని.. రాష్ట్రంలో అందరికి సమన్యాయం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని.. ఈ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు రత్నాకర్ రెడ్డి, జనాగం శంకర్, మంకాల ప్రవీణ్, మనాల రవి, పోతిరెడ్డి మధుసూదన్ రెడ్డి, సోమ రాంరెడ్డి, బుర్ర తిరుపతి తదితరులు పాల్గొన్నారు.