నవతెలంగాణ -చిట్యాల
నల్గొండలోనీ కాంగ్రెస్ లో నలుగురు ముఖ్యమంత్రులు తయారవుతున్నారనీ, కాంగ్రెస్ నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, నకిరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిరుమర్తికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ గారు అన్నారు. నకిరేకల్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారితో కలిసి ఎంపీ బడుగుల విలేకరుల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు ప్రజలకు సేవ చేద్దాం అని ఆలోచన లేదని, పదవుల కోసం కుర్చీల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. నకరికల్ నియోజకవర్గం లో ప్రజలు ప్రశాంతంగా ఉండాలంటే , అరాచకాలు లేకుండా రౌడీయిజం లేకుండా ప్రజలు ఎవరు పని వారు చేసుకుని జీవించాలంటే, చిరుమర్తి లింగయ్యను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలన్నారు. సౌమ్యుడు అభివృద్ధి కోసం పనిచేసేవాడు చెడును ప్రోత్సహించనీ వ్యక్తి చిరుమర్తి లింగయ్యను మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలన్నారు.