నవతెలంగాణ – మల్హర్ రావు
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదికలో ప్రజలు కరువయ్యారు.గురువారం మండల కేంద్రమైన తాడిచెర్ల మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. గత ఆర్థిక సంవత్సరంలో మండలం లోని వివిధ గ్రామాల్లో జరిగిన పనులపై సోషల్ ఆడిట్ బృందం నిర్వహించిన నివేదికలు ప్రవేశపెట్టారు. అయితే ఉపాధిహామీ సిబ్బంది గ్రామాల్లో ప్రజలకు, ఉపాది కూలీలకు డప్పు చాటింపు చేయించకపోగా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ప్రజావేదికలో ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడం గమనార్హం.