కాంగ్రెస్ పాలనలో ప్రజలు కష్టాలు పడుతున్నారు..

– రుద్రవరం బీఆర్ఎస్  గ్రామ శాఖ అధ్యక్షుడు హరికృష్ణ..
నవతెలంగాణ – వేములవాడ 
కాంగ్రెస్ పాలనలో ప్రజలు కష్టాలు పడుతున్నారుఅని,రుద్రవరం బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు హరికృష్ణ అన్నారు. మంగళవారం వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామ శాఖ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరికృష్ణ  మాట్లాడుతూ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ముంపు గ్రామ ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేసి మోసపోయారన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు కష్టాలు పడుతున్నారని, 24 గంటలు కరెంటు రావట్లేదని, నీటి కరువు ఏర్పడిందని అన్నారు. కెసిఆర్ ప్రభుత్వంలో నిండుకుండలా ఉన్న మిడ్ మానేరు డ్యాం పూర్తిగా ఎండిపోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఇప్పటికైనా గమనించి బిఆర్ఎస్  ఎంపి వినోద్ కుమార్ ను అత్యధిక మెజారిటీతో  గెలిపించుకుందం అని పిలుపునిచ్చారు. ఢిల్లీలో తెలంగాణ గలం వినిపించాలంటే వినోద్ కుమార్ తోనే సాధ్యమని గుర్తు చేశారు. కార్యక్రమంలో గ్రామ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.