– డాక్టర్ శశాంక్ గోయల్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రజలే కేంద్రంగా పాలన అవసరమని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ శశాంక్ గోయల్ తెలిపారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లో ఆర్మడ్ ఫోర్సెస్-సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ల కోసం సిటీజన్-సెంట్రిక్ గవర్నెన్స్ ఏర్పాటు చేసిన ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు మరింత సులభతరంగా సాంకేతికతను ఉపయోగించుకునేందుకు ఇష్టపుడుతున్నారని తెలిపారు. సెంటర్ హెడ్, కోర్స్ డైరెక్టర్ డాక్టర్ మాధవి రావులపాటి సమావేశంలోని నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నట్టు తెలిపారు.