
– నంబర్ ప్లేట్ లేని వాహనాల సీజ్
– నిజామాబాద్ ఏసిపీ ఎల్. రాజా వెంకట్ రెడ్డి
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజలు మద్యం సేవించి వాహనాలను నడపరాదని నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజ వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడిపితే జరగరానిది ఏదైనా జరిగితే మనల్ని నమ్ముకున్న కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురవుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని వాటిని దృష్టిలో పెట్టుకొని వాహనాలు నడిపే ముందు పలు జాగ్రత్తలను తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వాహనాలు నడిపే వాహనదారులు తమ వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలను సక్రమంగా, అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. నగరంలోని నాల్గవ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం 10:00 గం.ల నుండి మద్యాహ్నం 1300 గం.ల వరకు ఒకటి, మూడు, నాలుగు, ఐదు పోలీస్ స్టేషన్ పరిధిలో సంబంధిత ఎస్ హెచ్ ఓ లు ఎస్సై పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలను నిర్వహించారని తనిఖీలలో భాగంగా 29 చక్రవాహనాలకు సంబంధిత ధ్రువపత్రాలు అందుబాటులో లేకపోవడం అలాగే బండికి నెబర్ ప్లేట్ లేనందున పట్టి వాహనాలను 29 ద్విచక్ర వాహనాలను సీజ్ చేయడం జరిగిందన్నారు. కావున నిజామాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని వాహనదారులందరూ ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖ సూచించిన నియమ నిబంధనలను పాటించాలని ఉల్లంఘిస్తే చర్యలు తప్పమన్నారు.