అభివృద్ధి‌పై ప్రజలకు అపోహలు వద్దు

– ప్రభుత్వ విప్‌ సునీతమహేందర్‌రెడ్డి
నవతెలంగాణ- ఆలేరుటౌన్‌
అభివృద్ధి‌పై ప్రజలకు అపోహలు వద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ అభివద్ధి సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని ప్రభుత్వ విప్‌, ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడిసునీత మహేందర్‌ రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలో మూడు కోట్లతో ఆలేరు పురపాలక సంఘం నూతన భవనం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దళిత బంధు, బీసీ బందు అబ్బిదారుల ఎంపికలో అపోహలు వద్దన్నారు. ఆర్థికంగా రాష్ట్రం కష్టాల్లో ఉందన్నారు.ఎమ్మెల్యేగా ప్రతి పనిలో జోక్యం చేసుకుంటూ ఆలేరు పట్టణ అభివద్ధి కొరకు పాటుపడుతున్నానన్నారు. మున్సిపల్‌ కార్యాలయం నిర్మాణ పనులు జరగవని అనేక అపోహలు ఉండేవన్నారు. రాజకీయాలు చేయవద్దని అభివద్ధి కలిసి రావాలని ప్రతిపక్షాలకు సూచించారు. ఆలేరు కమ్యూనిస్టుల గడ్డ అని ,ఇది పోరాటాలకు అడ్డా అని చెప్పారు.డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పంపిణీలో రాజకీయం చేశారన్నారు. పౖెెరవీలకు తావు లేదన్నారు. మున్సిపల్‌ చైర్మెన్‌వస్పరి శంకరయ్య మాట్లాడుతూ పనిచేసే వారికే, చులకన చేసే రోజులని, కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలని, నేను వీకలాంగుడినని హేలానా చేశారని, పనితోనే సమాధానం చెబుతామన్నారు. గతంలో బహదూర్‌ పేట సర్పంచిగా పనిచేసినప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఉత్తమ సర్పంచ్‌ అవార్డు తీసుకున్న సంగతి గుర్తు చేశారు. ఈ సమావేశంలో అలేరు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ మోత్కుపల్లి. జ్యోతి ప్రవీణ్‌, వైస్‌ చైర్మన్‌, పోరెడ్డి. శ్రీనివాస్‌,మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ మొరిగాడి. మాధవి వెంకటేష్‌,మాజీ జెడ్పిటిసి, బోట్ల. పరమేశ్వర్‌, మార్కెట్‌ డైరెక్టర్లు, పాషికంటి. శ్రీనివాస్‌,పత్తి. వెంకటేష్‌, జిల్లా,ఆర్టిఏ సభ్యులు,పంతం. కష్ణ, గొర్ల కాపర్ల సంఘం ,డైరెక్టర్‌ జల్లి. నరసింహులు, వార్డు కౌన్సిలర్లు సి హెచ్‌ ,సునీత, ఎ. దయమని, బెతి.రాములు, గుత్త. సమంతా రెడ్డి,సంగు.భూపతి,దాశీ. నాగలక్ష్మి సంతోష్‌,మోర్తాల. సునీత. రమణారెడ్డి, జూకంటి. శ్రీకాంత్‌, కౌన్సిల్‌ సభ్యులు సీస.రాజేష్‌ ,ఎం డి. రియాజ్‌ , బింగి.లత రవి , బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు వస్పరి. శివకుమార్‌, జూకంటి. ఉప్పలయ్య, దయ్యాల. సంపత్‌ , బిజన. బాలరాజు , మహేందర్‌ , బాలకిషన్‌ , కటకం.మల్లేష్‌, సంతోష్‌ పాల్గొన్నారు.