చండూరులో కూసుకుంట్ల ప్రసంగం వింటున్న ప్రజలు

నవతెలంగాణ- నాంపల్లి: సాధారణ ఎన్నికలను పురస్కరించుకొని మునుగోడు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమ సందర్భంగా నియోజకవర్గంలోని ఏడు మండలాల నుండి ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనగా చండూరు మండల కేంద్రంలో ఆయన ప్రసంగించారు. ఆయన ప్రసంగాన్ని ఎత్తైన బిల్డింగులు, వాటర్ ట్యాంకులు ఎక్కి ప్రజలు ఆసక్తిగా చూస్తూ వినడం జరిగింది.