
– జంపన్నవాగు, ముంపు ప్రాంతాలను పరిశీలించిన అధికారులు
నవతెలంగాణ – తాడ్వాయి
వర్షాల పట్ల ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక తహసీల్దార్ తోట రవీందర్ ఎంపీడీఓ సుమన వాణి లు అన్నారు. బుధవారం మండలంలోని జంపన్న వాగు పరిసర గ్రామాలైన వెంగళాపూర్, నార్లాపూర్, ఊరట్టం గ్రామాలను సందర్శించి పరిశీలించారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని మేడారం జంపన్నవాగు ముంపు ప్రాంతాల గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేశారు. మేడారం జంపన్నవాగు ఉధృతి ఏ సమయంలోనైనా పెరిగే ప్రమాదం ఉందన్నారు. ఎలాంటి సమాచారం అయినా రెవెన్యూ పోలీస్ మిగతా అధికారులకు సమాచారం ఇవ్వాలని, సమాచారం లేకుండా వాగుల్లో దిగరాదన్నారు. జంపన్నవాగు పరిసరాల్లోని చిరు వ్యాపారులు, గ్రామస్తులు అప్రమత్తం గా ఉండాలన్నారు. వారి వెంట ఎంపీ ఓ శ్రీధర్ ఎంఆర్ఐ పిట్టల సాంబయ్య సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.