ఎయిడ్స్ నిర్ములనకై ప్రజలు చైతన్యవంతులు కావాలి

People need to be conscious to eradicate AIDS– డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఎయిడ్స్ డే
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
ఏయిడ్స్ వ్యాధిని పూర్తిగా నిర్ములించాలంటే విస్తృత అవగాహన కల్పించడంతో పాటు ప్రజలను చైతన్యవంతులు చేయడమే మార్గమని డీఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. ఆదివారం ప్రపంచ ఏయిడ్స్ దినత్సోవం సందర్భంగా డీఎంహెచ్ఓ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. ముందుగా విద్యార్థులకు ఏయిడ్స్ వ్యాప్తి, నివారణ, విద్యార్థుల పాత్ర తదితర అంశాలను పలువురు తెలియజేశారు. అనంతరం ఏయిడ్స్ డే సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు మెమోంటోలు, సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ మాట్లాడుతూ… ప్రతి ఏటా ఏయిడ్స్ అవగాహన కల్పిచడంతో పాటు బాధితులకు సానుభూతి తెలుపుతూ చనిపోయిన వారికి నివాళులర్పించడానికి ఏయిడ్స్ డే నిర్వహిస్తున్నామన్నారు. ఏయిడ్స్ నివారణ అవగాహనతోనే సాధ్యమన్నారు. ఇది ప్రాణాత్మక వ్యాధి కాదని, దీర్ఘకాలిక వ్యాధుల్లో పరిగణిస్తామన్నారు. అనైతిక లైంగిక సంబంధల వల్ల ఎక్కువగా వస్తుందని, సురక్షితమైన ఇంజెక్షన్ లు లేక పోవడంతో వ్యాప్తి చెందుతాయన్నారు. ఏయిడ్స్ తెలిసి రావొచ్చు.. తెలియ రావొచ్చు దానికి వారు బాధ్యులు కాదన్న విషయాన్ని గ్రహించాలన్నారు. బాదితులను బహరిష్కరించడం చట్టరీత్య నేరమన్నారు. ఈ విషయాలు విద్యార్థులు తెలుసుకొని పలువురికి అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యశాల అధికారులు, సిబ్బంది ఉన్నారు.