
డ్రగ్స్ నివారణ పై ప్రజలు చైతన్యవంతం కావాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ రఘువీర్ రెడ్డి అన్నారు. గురువారం తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాలలో సర్కిల్ ఇన్స్పెక్టర్ రఘువీర్ రెడ్డి మరియు ఎస్సై సత్యనారాయణ ఆధ్వర్యంలో డ్రగ్స్ నివారణ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ యువత డ్రగ్స్ మత్తు పదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు అని సూచించారు. ఎస్సై సత్యనారాయణ మాట్లాడుతూ డ్రగ్స్ మహమ్మారి నేడు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న అత్యంత భయంకర వ్యసనం అన్నారు. దీని తరిమికొట్టాల్సిన బాధ్యత యువత విద్యార్థులపై ఉందని పేర్కొన్నారు. డ్రగ్స్ తో విచక్షణ కోల్పోతారని ఏం చేస్తున్నారో కూడా వారికి తెలియదని అన్నారు. డ్రగ్స్ మాఫియా యువతను టార్గెట్ చేసుకునే చాప కింద నీరులో తమ వ్యాపారాన్ని విస్తరిస్తుందని తెలిపారు. అదేవిధంగా పిల్లల ప్రవర్తన పై ఎల్లప్పుడూ నిఘా ఉంచాలని, అనుమానం వుంటే పోలీస్ వారికి తెలియజేయాలని కోరారు.ఈ కార్య క్రమం లో ప్రిన్సిపాల్ సునీత, ఇతర టీచర్లు, 300 మంది విద్యార్థులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.