భారీ వర్షాలు కురుస్తున్నందున మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

– ఎస్సై డి. సుధాకర్
నవతెలంగాణ- గాంధారి
గాంధారి మండలంలో నిన్నటి నుంచి భారీ వర్షాలు కుుస్తుండడంతో మండల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని గాంధారి ఎస్సై డి. సుధాకర్ తెలిపారు. పాత మట్టి గోడల ఇండ్లలో ప్రజలు నివాసం ఉండరాదు. కూలే అవకాశమున్న వాటికి దూరంగా ఉండాలి. విద్యుత్ స్తంభాలకు ఎలక్ట్రికల్ షాక్ వచ్చే అవకాశం ఉన్నందున వాటిని తాకరాదు. రైతులు పంట పొలాలకు వెళ్లే సమయం లోను విద్యుత్ స్తంభాలు మీటర్లు స్టార్టర్లను తాకరాదు. వాగులు, కాలువలు వరద ప్రవాహంతో ఉన్నందున వాటిని దాటేందుకు ప్రయత్నించరాదు. అవసరమైతే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. తీవ్ర వర్షా ప్రభావం ఉన్నందున పిల్లలు బయటకు వెళ్లకుండా చూసుకోవాలి నీటిలో ఆడేందుకు సరదాగా వెళ్లి ప్రమాదాల బారిన పడే అవకాశం ఉన్నందున పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి. నీటితో నిండి ఉన్న చెరువులు, కుంటల వద్దకు చూసేందుకు వెళ్లరాదు, అందులో ఆటలాడరాదు, వర్షం నీటితో తడిసి ఉండడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఏదైనా అత్యవసరం ఉన్నట్లయితే డయల్ 100, పోలీస్ స్టేషన్ అధికారులకు సమాచారం ఇవ్వాలి ఎస్ఐ తెలిపారు.