నవతెలంగాణ- తొర్రూర్ రూరల్:
పాలకుర్తి నియోజకవర్గం ప్రజలు ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఓట్ల ద్వారా రిటైర్మెంట్ ఇవ్వాలని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమాన్ల ఝాన్సీ రెడ్డి అన్నారు గురువారం మండలంలోని మాటేడు, చర్లపాలెం గ్రామలలో గడపగడపకు కాంగ్రెస్ పల్లె పల్లెకు జానసమ్మ కార్యక్రమంలో భాగంగా మాటేడు గ్రామంలో బతుకమ్మలు బోనాలతో ఘనంగా స్వాగతం పలికారు గ్రామంలో ప్రతిష్టించిన దుర్గామాత కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేటీఆర్ కెసిఆర్ ఖజానా నింపుకుంటే పాలకుర్తిలో ఆలయంలో ప్రత్యేక పూజలు మరియు వేణుగపాలస్వామి ఆలయంలో శివాలయంలో పూజలు నిర్వహించి అనంతరం గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ గత ఎన్నికల్లో దయాకర్ రావు ఇది ఒక్కసారి గెలిపించండి మళ్ళీ ఇంకోసారి ఓట్లు అడగనని ఓట్లు వేయించుకొని పబ్బం గడిపాడని 9 సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో చేసింది ఏమీ లేదని కాలేశ్వరం ప్రాజెక్టు పేరు మీద లక్ష కోట్ల అవినీతి కేసీఆర్ కుటుంబం పాల్పడ్డారని, పాలకుర్తిలో దగా దయాకర్ రావు మిషన్ భగీరథ పేరుతో నాణ్యతలేని పనులు చేసి వేల కోట్ల రూపాయలు తన ఖజానాలో వేసుకున్నాడు అని వారి కుటుంబాలు దోచుకొని దాచుకోవడమే సరిపోయిందని ప్రజలకు చేసింది ఏమీ లేదని ఆరోపించారు రాష్ట్రంలో కేడీని, పాలకుర్తిలో ఈ దొంగని తరిమికొట్టేందుకు పాలకుర్తి నియోజకవర్గం ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బూత్ స్థాయి నుండి ఒక సైనికుని భలే పని చేయాలన్నారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హామ్య నాయక్,మండల అధ్యక్షులు సంతోష్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, పీసీసీ మాజీ సభ్యులు ముత్తినేని సోమేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంగల్ రావు , మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రశాంతి, అమ్మపురం గ్రామ ఎంపీటీసీ సభ్యులు, రాష్ట్ర ఎంపీటీసీల పోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు ముద్దం విక్రమ్ రెడ్డి,తొర్రూరు పట్టణ అధ్యక్షులు సోమ రాజశేఖర్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు మెరుగు మల్లేశం గౌడ్, పార్టీ సీనియర్ గ్రామ శాఖ అధ్యక్షులు మహేష్, ఉపాధ్యక్షులు రమేష్, యాకయ్య, రాజేందర్, ఇస్తారి, నరసింహారెడ్డి, బొల్లం రాములు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నవీన్, మధు,రాంబాబు, లింగస్వామి, కొమరయ్య ,తదితరులు పాల్గొన్నారు.