
తొమ్మిదిన్నర సంవత్సరాలుగా అవినీతి అరాచక కుటుంబ పాలన చేస్తున్న కేసీఆర్ కుటుంబ పాలన నుండి తెలంగాణ ప్రజలు విముక్తి కావాలని కోరుకుంటున్నారని మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు పిడమర్తి రవి అన్నారు.మంగళవారం తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయినప్పుడు మిగులు బడ్జెట్గా ఉన్న తెలంగాణ ధనిక రాష్ట్రం కెసిఆర్ పాలనలో అప్పుల రాష్ట్రంగా మిగిలిపోయిందని కేసీఆర్ కుటుంబం మాత్రం దేశంలోనే నెంబర్ వన్ ధనిక కుటుంబంగా మారిపోయిందని అన్నారు. తుంగతుర్తి లో ఇద్దరు ఓయూ నాయకుల మధ్య రసవత్తర పోరు జరగనున్నదని అన్నారు. నియోజకవర్గ ప్రజలు త్వరలో అవినీతి అరాచక పాలనకు చరమగీతం పాడనున్నట్లు తెలిపారు .తెలంగాణ ప్రజలు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కోసం ఎదురుచూస్తున్నారని తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ 40 రోజుల్లో తెలంగాణలోని ప్రతి ఒక్క ఓటర్ ఒక సైనికుడులా పనిచేసి కెసిఆర్ కబంధ హస్తాల నుండి తెలంగాణకు విముక్తి కల్పించాలని కోరారు. తుంగతుర్తి నియోజకవర్గం లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని, టికెట్ ఎవరికీ వచ్చిన కార్యకర్తలు అందరూ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దబోయిన అజయ్ కుమార్, కొండ రాజు, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.