భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మండలంలోని లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొయ్యుర్ ఎస్ఐ నరేష్ శుక్రవారం ఒక ప్రకటన సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు ఎవరు బయటకు వెళ్లవద్దన్నారు. తాడిచెర్ల, మల్ లారం, పివినగర్, కుంభంపల్లి,వళ్లెం కుంట, కొండంపేట తదితర మానేరు పరివాహక ప్రాంతాల్లో పశువుల కాపర్లు, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు.పాత ఇండ్లలో ఉండకూడదని, వాగులు, చెరువుల వద్దకు వెళ్లవద్దని, అత్యవసర అయితే 100కు కాల్ చేయాలని సూచించారు.