నవతెలంగాణ రెంజల్: మండల కేంద్రమైన రెంజల్ మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా పాలనలో దరఖాస్తులు చేస్తున్న కుటుంబాలకు జీరో కరెంటు బిల్లు, 500 సబ్సిడీ గ్యాస్ కోసం ప్రజలు బారులు తీరారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల లోపు వారు తమ దరఖాస్తు ఫారాలతో మండల పరిషత్ కార్యాలయానికి వస్తున్నారు. వారికి మండల పరిషత్ సిబ్బంది టోకెల ద్వారా ఆన్ లైన్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వడంతో వారు అందరికంటే ముందుగా వచ్చి తమ దరఖాస్తు ఫారాలను పూర్తి చేసుకోవాలని మండల పరిషత్ కార్యాలయం విచ్చేసి, సీరియల్ గా క్యూలో నిలుచుంటున్నారు.