
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
నగరంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో మూసీ నది ఉవేత్తిన ప్రవహిస్తుంది. బుధవారం జిహెచ్ఎంసి గోషామహల్ సర్కిల్ -14 యు సిడిపిఓ విద్యాసాగర్ ఆధ్వర్యంలో మూసీ నది పక్కన ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజలకు పునరావాస కేంద్రాలుగా గోషామహల్ డివిజన్ లోని చుడి బజార్ భరత్ కమ్యూనిటీ హాల్, గౌలిగూడ కమ్యూనిటీ హాల్ లను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యుసిడిసిఓ సమ్మయ్య, ఆర్ పి సుమలత, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.