నవతెలంగాణ-మణుగూరు
భారీ వర్షాలు కురుస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మణుగూరు సబ్ డివిజన్ ప్రజలను డీఎస్పీ రవీందర్ రెడ్డి కోరారు. రాగల రెండు రోజులపాటు జిల్లాలో పలు భారీ, అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ద్వారా రెడ్ అలర్ట్ జారీ చేయబడిందని తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని అదేవిధంగా ముఖ్యంగా పశువుల కాపరులు, చిన్న చిన్న వాగుల పక్కన ఉండే పంటపొలాల యజమానులు, గోదావరి పరివాహక ప్రాంత గ్రామ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో గోదావరిలోకి వెళ్లకూడదని తెలిపారు. ప్రజలు ఏదైనా సమస్య ఉంటే వెంటనే 100 డయల్ లేదా మణుగూరు పోలీస్ వారిని సంప్రదించాల్సిందిగా కోరారు.