గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని ఎస్సై రాఘవేందర్ గౌడ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. మండల ప్రజలకు పోలీసులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలియజేసారు. ఎవరైనా ఆపదలో ఉంటే స్థానిక పోలీస్ స్టేషన్ కు, అధికారులకు లేదా డయల్ 100కి ఫోన్ చేస్తే సహాయాన్ని అందిస్తారని,పోలీసులకి సహకరించాలన్నారు. చెరువులకు, కుంటలకు దూరంగా ఉండాలని.శిధిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉండరాదని తెలియజేశారు.