నవతెలంగాణ-సుల్తాన్ బజార్
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేతర్ బస్తి సూర్య నగర్ బస్తీ దవాఖాన డాక్టర్ సాయి ప్రియ అన్నారు. మంగళవారం బస్తీ దవాఖానాలో ఆమె మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కువగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వకుండా చూసుకోవాలన్నారు. కూలర్లు, ఫ్లవర్ కుండీలు ఇంటి బయట ఉన్న కొబ్బరి చిప్పలు, పాత టైర్ల వంటి వాటిలో నీరు నిలిచి దోమలు వృద్ధి చెందుతాయన్నారు. దోమలు దరి చేరకుండా ఎప్పటికప్పుడు వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవాల న్నారు. ప్రజలు దోమతెరలు వాడాలని సూచించారు. చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలన్నారు. మంచినీటిని వేడి చేసి చల్లార్చినా నీరుతీసుకోవాలన్నారు. బయట దొరికే తినుబండారాలను తినవద్దని సూచించారు. వేడివేడిగా ఉండేబలమైన ఆహారం తీసుకో వాలని ప్రజలకు సూచించారు. ఎక్కువగా కూర గాయలు, పండ్లు, ఆకుకూరలు తీసుకోవా లన్నారు. దగ్గు, చలి జ్వరం, జలుబు ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలని సూచించారు. తమ ఆరోగ్య కేంద్రంలో బీపీ, షుగర్, థైరాయిడ్, వివిధ రకాల రక్త పరీక్షలు ఉచితంగా చేసి అవ సరమైన వారికి మందులను అందిస్తున్నామన్నారు.