ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎంపీడీవో

నవతెలంగాణ-పెద్దవంగర:  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో రాను్న మూడు రోజులు పాటు భారీ వర్షాలు పండుతాయని, ప్రభుత్వం జిల్లాను రెడ్ అలెర్ట్ ప్రకటించిందని ఎంపీడీవో వేణుమాధవ్ తెలిపారు. మండలంలోని ఔసలి తండా, బొమ్మకల్ గ్రామాల్లో నిర్వహించిన వైద్య శిబిరాలను ఆయన సందర్శించారు. అనంతరం చిట్యాల గ్రామంలో కొనసాగుతున్న అవెన్యూ ప్లాంటేషన్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైద్య సిబ్బంది మండలంలోని గ్రామాలు, తండాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు నిత్యం అందుబాటులో ఉంటూ, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటికి రావాలని ఎంపీడీవో సూచించారు.