– కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రిలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం..
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రి ఏ ఆర్ టి సెంటర్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆసుపత్రి పరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. కమ్యూనిటీ వారు మరింత అప్రమత్తంగా ఉంటూ మందులను సక్రమంగా తీసుకోవాలని సూచించారు. కమ్యూనిటీలకు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలను వినియోగించుకోవాలన్నారు. మానసికంగా ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు. అపోహలు ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలని సూచించారు. చికిత్స తీసుకుంటున్న కమ్యూనిటీకి గ్రూపులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. విజేతలైన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఆర్ఎం ఓ డాక్టర్ సాధన, డాక్టర్ వెంకటేష్, ఏ ఆర్ టి సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సువీత రాథోడ్, వైద్యులు, నర్సింగ్ ఆఫీసర్స్, వైద్య సిబ్బంది, కమ్యూనిటీ గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.