
నవతెలంగాణ – మద్నూర్
ప్రజలారా సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, మీకు ఏదేదో మోసపూరితమైన మాటలు చెప్పి మీ ఆధార్ నంబర్ గాని, మీ అకౌంట్ నెంబర్ గాని, మీ ఓటిపి నంబర్ గాని, అడిగి బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బులు అకౌంట్లో నుండి ఎగ్గొట్టేందుకు బ్యాంకు అధికారుల పేర్లతో ఫోన్లు చేస్తారు. అలాంటి వాటిని నమ్మకుండా ఏది వారికి చెప్పకుండా జాగ్రత్తగా ఉండాలని సోమవారం నాడు మద్నూర్ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ లో ప్రయాణికులకు గ్రామస్తులకు పోలీస్ సిబ్బంది సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ కానిస్టేబులు హోంగార్డులు పాల్గొన్నారు.