చట్టాలపై ప్రతీ ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని బాన్సువాడ బార్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణమూర్తి అన్నారు. బాన్సువాడ మండల న్యాయ సేవ అధికారిక కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని దేశాయిపేట్ గ్రామంలో న్యాయవాదులు చట్టాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ చట్టాల అవగాహన ఉండటం వల్ల వారి వారి హక్కుల కోసం హక్కుల సాధన కోసం కృషి చేయవచ్చన్నారు. బడీడు పిల్లలను బడిలో ఉంచాలని, బాల్యంలో అందరూ చదువుకోవాలన్నారు. బాల్యంలో బాల్యవివాహాలు చేయడం నేరమని వివాహ వయస్సు వచ్చాక పెళ్ళిలు చేయాలని సూచించారు. భవన నిర్మాణ రంగంలో పని చేస్తున్న కార్మికులు లేబర్‌కార్డులు తీసుకోవాలని వాటి ద్వారా వచ్చే ప్రయోజనాలు, ఇన్సూరెన్స్‌లను వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణమూర్తి, న్యాయవాదులు ఎంఏ ఖలీల్, మొగులయ్య, ఆనంద్ కుమార్, మాజీ ఎంపీపీ భూనేకర్ ప్రకాష్, నాగభూషణం, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, యువకులు, రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.