ప్రజలందరికీ సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించాలి

– జిల్లా గ్రంథాలయ చైర్మన్ గంగాపురం రాజేందర్
నవతెలంగాణ-అచ్చంపేట :    సమాచార హక్కు చట్టం పై అందరికీ అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులకు ఉండాలని  నాగర్ కర్నూల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గంగాపురం రాజేందర్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన గంగాపురం రాజేందర్ ను గురువారం సమాచార హక్కు చట్టం రక్షణ సమితి ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. సందర్భంగా గంగాపురం రాజేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల కొరకు ఏర్పాటు చేయబడిన వ్యవస్థను జవాబు దారితనంతో అవినీతి రహితంగా పని చేయాలంటే ప్రజలు తమ బాధ్యతను సక్రమంగా పోషించాలన్నారు. ప్రజలందరికీ సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించి వారిని చైతన్య పరిచి సహ చట్టాన్ని సమర్థవంతంగా వినియోగించుకునే విధంగా అవగాహన కల్పించాలని కమిటీ సభ్యులను కోరారు. వివిధ ప్రభుత్వల శాఖల ద్వారా ఆయా గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను, కేటాయించడానికి ఖర్చుల వివరాలను తెలుసుకునే బాధ్యత ప్రజలకు ఉంటుందన్నారు
 కొన్ని ప్రభుత్వాలు ఈ సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో  అధ్యక్షులు కొర్ర కిషన్ నాయక్, ఉపాధ్యక్షులు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి అజీజ్, కోశాధికారి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.