
భిక్కనూరు పట్టణ కేంద్రంలో బిజెపి అధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో బిజెపి మండల అధ్యక్షులు ఉప్పరి రమేష్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు అబద్ధాలు 66 మోసాల పేరిట కరపత్రాలను విడుదల చేసినారు. అనంతరం ఆయన మాట్లడుతూ.. తెలంగాణ ఆడపడుచులకు మహాలక్ష్మి పథకం, వృద్ధులకు రూ.4000 పింఛన్, వికలాంగులకు రూ.6000 గాలికి వదిలేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి తిరుమలేష్, శ్రీనివాస్ రెడ్డి, బసవ రెడ్డి, యాదగిరి గౌడ్, మండల ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి, సాయి రెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు లక్ష్మి, ఓబీసీ మోర్చా శంకర్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు రాకేష్, రామచంద్రం, ప్రవీణ్, స్వామి, ప్రభాకర్, నరేందర్, సంతోష్, రాము బిజెపి నాయకులు పాల్గొన్నారు.