– బిరెడ్డి సాంబశివ సీపీఐ(ఎం) ములుగు జిల్లా కార్యదర్శి
నవతెలంగాణ-గోవిందరావుపేట
వివిధ పార్టీల నుండి సీపీఐ(ఎం)లో చేరిక బడా పెట్టుబడుదారులు భూస్వాముల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల చెర నుండి ప్రజలు విముక్తి చెందాలని సీపీఐ(ఎం) పార్టీ ములుగు జిల్లా కార్యదర్శి బిరెడ్డి సాంబశివ అన్నారు. బుధవారం ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ చేస్తున్న ప్రజా పోరాటాలకు ఆకర్షితులై బుస్సాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొలెపాక మహేందర్ ఆధ్వర్యంలో బుస్సాపూర్ గ్రామ నాయకులు కురసం ముత్తయ్య, మంద అశోక్, బుద్ధుల పైడి, దేవేందర్, వెంకటేష్, లావణ్య,10 కుటుంబాలు సీపీఐ(ఎం) పార్టీ ములుగు జిల్లా కార్యదర్శి బిరెడ్డి సాంబశివ సమక్షంలో చేరాయి. వారికి సాంబశివ కండువాలు
కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సాంబశివ మాట్లాడుతూ బుస్సాపూర్ గ్రామంలో సీపీఐ(ఎం) ఇంటి స్థలాల కోసం, పోడు భూముల కోసం అనేక పోరాటాలు నిర్వహించిందని ఆయన తెలిపారు. భవిష్యత్తులో సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు నిర్మిస్తామని తెలిపారు. బుస్సాపూర్ లో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు బూర్జువా భూస్వామ్య పార్టీలకు తోత్తులుగా మారి ప్రజలను దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు. ఈ పార్టీలన్నీ ప్రజావంచన పార్టీలేనని అన్నారు. అటువంటి పార్టీలను ప్రజలు వీడి ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న ఎర్రజెండా పార్టీ సీపీఐ(ఎం)లో చేరి తమ హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పొదిల చిట్టిబాబు, మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు తీగల ఆగి రెడ్డి, గొంది రాజేష్, మండల కమిటీ సభ్యుడు అంబాల మురళి తదితరులు పాల్గొన్నారు.
