
– గ్రామాల్లో పండుగ వాతావరణం వెల్లివిరిసింది
– నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డి
నవతెలంగాణ – రాయపర్తి
పాలకుర్తి నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని గణనాధుని ప్రార్థించినట్లు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి అన్నారు. గురువారం మండలకేంద్రంతో పాటు పాణ్య నాయక్ తండా, కిష్టపురం, వాంకుడోత్ తండా, పోతిరెడ్డి పల్లి, కాట్రపల్లి, బురహన్ పల్లి, తేటేకుంట తండా, కొండూరు, తిర్మలాయపల్లి, గన్నారం, జెతురాం తండా గ్రామాల్లో గణపతి నవరాత్రి వేడుకల్లో భాగంగా వివిధ రూపాలలో కొలువుదీరిన గణనాథులను సందర్శించి ప్రత్యేక పూజలు చేపట్టాగా అర్చకులు పూర్ణకుంభలతో, మహిళలు కోలాట నృత్యాలు, మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భగవంతుడి ఆశీస్సులతో ప్రజలందరూ బాగుండాలని కోరారు. వర్షాలు రావడంతో సాగుకు పుష్కలమైన నీరు రావడం సంతోషకరమన్నారు. ప్రజలు బాగుంటేనే దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందని వ్యాఖ్యానించారు. ప్రజాసేవకు మించిన దైవం ఏది లేదన్నారు. ప్రజలు గణపతి నిమజ్జన సమయంలో పలు జాగ్రత్తలు వహించి అధికారుల సూచనల మేరకు నిమజ్జనం చేయాలని సూచించారు. గ్రామాల్లో పలువురి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తా అని హామీ ఇచ్చి మనోధర్యాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ అద్యక్షుడు హమ్య నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి, నాయకులు మాచర్ల ప్రభాకర్, గోవర్ధన్ రెడ్డి, నర్సిరెడ్డి, కృష్ణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఆఫ్రోస్ ఖాన్, ఉల్లంగుల నర్సయ్య, యాదగిరి, గబ్బెట బాబు, చిర్ర ఎల్లయ్య, కుందూరు రాంరెడ్డి, గిరిగాని రాజు, మహమూద్, కోతి కళ్యాణ్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.