
నవతెలంగాణ కంఠేశ్వర్
ప్రజా సమస్యలపై ప్రజలను పోరాటంలోకి కదిలించాలి అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యాలయంలో సీపీఐ(ఎం) పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ ముఖ్యఅతిథిగా హాజరై కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి సొంతంగా మెజారిటీ రాకుండా మిత్రపక్షాలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితికి నెట్టివేయబడ్డారని అయినప్పటికీ ప్రజల్లో మత్తత్వ భావజాలాన్ని పెంచి ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు పోవాలని ఆలోచిస్తున్నారని మతతత్వ విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలను సమస్యలపై పోరాటాల్లోకి కదిలించాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో వెనక పడుతుందని ఏ విధంగా ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను అమలు జరపటంలో ప్రణాళికను లేకుండా ముందుకు పోతున్నారని ఫలితంగా క్రమంగా ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నదని ప్రజల అసంతృప్తిని ఉపయోగించుకొని బిజెపి మత్తుతత్వ విధానాలతో ముందు ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని దీన్ని పార్టీ శ్రేణులు గ్రహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల పైన పోరాటాలు నిర్వహించినప్పుడే ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుందని స్వతంత్ర కృషితో పాటు వామపక్ష ప్రజాసంఘాలను సమస్యల పైన కలుపుకొని పోరాటాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధానంగా నిరుద్యోగ సమస్య, కార్మిక ఉద్యోగుల ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు జరపట్టంలో అదేవిధంగా వృద్ధులకు వితంతువులకు పెంపుదల లో ఇంకా ప్రభుత్వం వేయటం లేదని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్ రమ, జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, జై శంకర్ గౌడ్, వెంకటేష్, నూర్జహాన్, కమిటీ సభ్యులు వై గంగాధర్, నన్నే సబ్, గంగాధర్, సుజాత, రాములు, శిల్ప లింగం ఇతరులతోపాటు వివిధ మండలాల కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.