
గంజాయి ఇతర మత్తు పదార్థాలపై ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని తొగుట సీఐ ఎస్కె. లతీఫ్ అన్నారు. మంగళవారం రాత్రి పోలీసు స్టేషన్, మండల పరిధిలోని కాన్గల్ గ్రామంలో పోలీసు కళాబృందంతో ప్రజలను చైతన్య పరిచే కనువిప్పు అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ బి. లింగం తో కలిసి సీఐ పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్ల లను తప్పకుండా చదివించాలని, చదివిస్తే ఏదైనా ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుందని సూచిం చారు. రోడ్డు ప్రమాదాలు దాని యొక్క పర్యవసా నాలు, మోటార్ వాహనాల చట్టం గురించి అవగా హన కల్పించారు. బాల్య వివాహాలు దాని యొక్క పర్యవసానాలు, చట్ట ప్రకారం బాల్యవివాహాలు నేరం అని తెలిపారు. సైబర్ నేరాల పట్ల అప్ర మత్తంగా, మోటార్ సైకిల్ దొంగతనాల గురించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలపై, గ్రామాలలో, పట్టణాలలో ఎవరైనా అనుమానాస్పదంగా కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసినా బ్యాంకు వివరా లు ఏటీఎం కార్డు వివరాలు అడిగితే ఎట్టి పరి స్థితు ల్లో చెప్పవద్దన్నారు. సైబర్ నేరం జరిగితే వెంటనే జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని సూచించారు. ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు విని యోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. పోలీసు కమిషనర్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగంతో కలిసి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాట్లు చెప్పారు. ఓటర్లను లను ఎవరైనా భయభ్రాంతు లకు గురిచేసిన ఓటు వేయమని డబ్బు, మద్యం, ఇతర గిఫ్ట్ పంపిణీ చేసిన వెంటనే భారత ఎన్నికల సంఘం హెల్ప్ లైన్ నెంబర్ 1950 ఫిర్యాదు చేయా లని సూచించారు. మూఢనమ్మకాలు, మద్యం తాగడం, పేకాట ఆడుట, వరకట్నం, ఆత్మహత్యలు, వృద్ధులైన తల్లిదండ్రులను మంచిగా చూసుకోవా లని అన్నారు. కళాబృందం సభ్యులు బాలు, రాజు, రవీందర్, తిరుమల, తెలంగాణ సాంస్కృతిక సార ధి సభ్యులు రవి, రవీందర్, ఎల్లయ్య, తిరుమల య్య, భార్గవి, రవీందర్, పాటల, నాటకం రూపంలో ప్రజలను చైతన్య పరిచినారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ప్రేమల చంద్రారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ మల్లయ్య, ప్రజా ప్రతినిధులు, పెద్ద లు, యువకులు, బాల బాలికలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.