ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్

నవతెలంగాణ- తుంగతుర్తి
తుఫాను ప్రభావంతో సూర్యపేట జిల్లా ఆరెంజ్ అలర్ట్ లో ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తుంగతుర్తి ఎస్సై ప్రవీణ్ కుమార్ సూచించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,అవసరమైతే తప్ప బయటకి రాకూడదని సూచించారు.అదేవిధంగా పాత,శిధిలావస్థకు చేరిన ఇండ్లలో,గుడిసెలలో నివాసం ఉంటున్న ప్రజలు వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు.పాత మిద్దెలు, గోడల పక్కన ఎవరు  నిల్చోకూడదని,తడిసిన స్తంభాలను విద్యుత్ మీటర్లను ముట్టుకోవద్దని,స్విచ్ బోర్డులను తాకవద్దని తెలిపారు.మత్స్యకారులు కూడా చేపలు వేటకు వెళ్లొద్దని,చెరువుల కాలువల దగ్గరకు పిల్లలను చేపల వేటకు పంపకూడదని సూచించారు. ఏదైనా అనుకోని ప్రమాదం సంఘటన జరిగితే వెంటనే డయల్ 100 కు కాల్ చేసి సమాచారం అందించాలని అన్నారు.